ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వల్లభనేని వంశీకి నాన్​ బెయిలబుల్ వారెంట్ - ఎమ్మెల్యే

గన్నవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీకి హైదరాబాద్ నాంపల్లి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదు అయ్యింది.

వల్లభనేని వంశీకి నాన్​బెయిలబుల్ వారెంట్

By

Published : Apr 3, 2019, 8:20 PM IST

వల్లభనేని వంశీకి నాన్​బెయిలబుల్ వారెంట్
గన్నవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీకి హైదరాబాద్ నాంపల్లి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదు అయ్యింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కానందున నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. 2013లోనే హైకోర్టు కేసు కొట్టివేసిందనీ.. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని వంశీ తెలిపారు. ఎన్నికల సమయంలో వైకాపా నేతలు ఎదురుగా ఢీకొట్టలేక... ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో ఆరా తీసి.. న్యాయపరంగా సమాధానం చెప్తానన్నారు.

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details