చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందంటూ గన్నవరం తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఎడ్లబండిపై రోడ్‌షోలో పాల్గొని.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. సంక్షేమ పథకాలకు రుణం చెల్లించుకునే సమయం వచ్చిందంటూ ఓట్లు అభ్యర్థించారు.
వల్లభనేని వంశీ వినూత్న ప్రచారం.. ఎడ్లబండిపై రోడ్ షో - ప్రచారం
కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఎడ్లబండిపై వినూత్న ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలకు రుణం చెల్లించుకునే సమయం వచ్చిందంటూ ఓట్లు అభ్యర్థించారు.
ఎడ్లబండిపై వల్లభనేని వంశీ వినూత్న ప్రచారం