ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 1, 2020, 1:27 PM IST

ETV Bharat / state

నిరుపయోగంగా ఓపెన్ జిమ్ పరికరాలు.. పట్టించుకునే వారు లేరు!

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ కార్యాలయంలో ఓపెన్ జిమ్ పరికరాలు తుప్పుపడుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా అధికారులు, పాలకులు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

Unusually open gym
నిరుపయోగంగా ఓపెన్ జిమ్ పరికరాలు


నందిగామ నగర పంచాయతీకి ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి మూడేళ్ల క్రితం ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేసింది. ప్రజలు వ్యాయామాలు చేసుకునేందుకు వీలుగా వీటిని బహిరంగ ప్రదేశంలో అందరికీ ఉపయోగపడే విధంగా బిగించాలని ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఈ పరికరాలను పట్టణంలోని మూడు ప్రాంతాల్లో అమార్చాలని స్థానిక నగర పంచాయతీ పాలకవర్గ తీర్మానించింది. ఇప్పటికీ ఈ తీర్మానం ఆచరణలోకి రాలేదు.

అనంతరం ప్రభుత్వం మారటంతో స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు.. ఈ పరికరాలు అన్ని ఒకే చోట బహిరంగ ప్రదేశంలో అమరిస్తే ఉపయోగకరంగా ఉంటుందని భావించారు. దీనికి అనుగుణంగా స్థలం పరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు. పరికరాలు అమర్చేందుకు నగర పంచాయతీ నుంచి 50 వేల రూపాయలు మంజూరు చేశారు. కేవలం స్థలం ఖరారు కాకపోవడం వల్లనే.. పరికరాలు మూడేళ్లుగా మూలన మగ్గుతున్నాయి. దీనిపై పాలకులు, అధికారులకు సమన్వయం లేకపోవడం సమస్యగా మారింది.

ఇదే అంశంమై నగర పంచాయతీ కమిషనర్ మల్లేశ్వరరావును సంప్రదించగా.. ఇంకా స్థలం ఖరారు కాలేదని, అయిన వెంటనే బహిరంగ ప్రదేశంలో ఓపెన్ జిమ్ పరికరాలు అమరుస్తామని వెల్లడించారు.

ఇవీ చూడండి:

'నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి'

ABOUT THE AUTHOR

...view details