విజయవాడ సత్యనారాయణ పురం శ్రీనగర్ కాలనీలో గృహం ముందు నిలిపి ఉన్న రెండు ద్విచక్రవాహనాలకు, ఒక కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. అర్ధరాత్రి సమయంలో ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు వచ్చారు. పెట్రోల్ బాటిల్తో వెనక కూర్చున్న యువకుడు వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ ఘటన సమీపంలోని సీసీ కెమెరాలలో రికార్డైంది. వాహన యజమాని శివ శంకర్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఉన్మాదం: అర్ధరాత్రి వాహనాలకు నిప్పు - satyanarayanapuram
విజయవాడ సత్యనారాయణపురంలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పంటించారు. అర్థరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వాహనాలకు నిప్పంటించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో నిక్షిప్తమవ్వగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు