కృష్ణా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పరీక్షల 4వ సెమిస్టర్ ఫలితాలను రిజిస్ట్రార్ ఉష విడుదల చేశారు. మొత్తం 10 వేల 665 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 6 వేల 814 మంది ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. మొత్తం 63.89 శాతం ఉత్తీర్ణత పొందారన్నారు. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించినట్టు వివరించారు. 5 వేల 800 మంది బాలికలకు గాను 4వేల 419 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. బాలురు 4వేల 865 మందికి గాను 2395 మంది మాత్రమే పాస్ అయ్యారని తెలిపారు.
కృష్ణా వర్సిటీ డిగ్రీ 4వ సెమిస్టర్ ఫలితాల విడుదల - krishna university
కృష్ణా విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ ఫలితాలను రిజిస్ట్రార్ ఉష విడుదల చేశారు. మొత్తం 63.89శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు.
ఫలితాలు