కృష్ణా జిల్లా గుడివాడ, గుడ్లవల్లేరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. గుడ్లవల్లేరు మండలం శ్రీ కొండలమ్మా తల్లి దేవస్థానంలో శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పూజారి జేపీ వెంకట నారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గుడివాడ శ్రీ భీమేశ్వర ఆలయం, పాటిమీద వెంకటేశ్వరస్వామి దేవస్థానాలలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యకమంలో వేదపండితులు, భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.