ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంకా లభించని విద్యార్థుల ఆచూకీ.. ఆందోళనలో తల్లిదండ్రులు - కంకిపాడులో విద్యార్థునుల అదృశ్యంపై ముమ్మర గాలింపు

Students Missing case: రెండ్రోజుల క్రితం కంకిపాడు పాఠశాల నుంచి అదృశ్యమైన విద్యార్థినుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విద్యార్థినులను తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? ఎక్కడికి తీసుకెళ్లాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పిల్లల ఆచూకీ తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

Students Missing case
విద్యార్థుల అదృశ్యంపై ముమ్మర గాలింపు

By

Published : Aug 3, 2022, 6:23 PM IST

Girls Missing In Kankipadu:కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు జడ్పీ పాఠశాల నుంచి రెండు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల అదృశ్యంపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. పోలీసులు బృందాలుగా ఏర్పడి చెన్నై, తిరుపతి, గూడూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు ఎలా ఉన్నారనేది విషయం తెలియక పోలీస్​స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు.

ఇదీ జరిగింది:కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని కంకిపాడు జడ్పీ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం కలకలం రేపుతోంది. పాఠశాలలో చదువుతున్న 9వ తరగతికి చెదిన విద్యార్థినులు సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోయారు. విద్యార్థులను అదే గ్రామానికి చెందిన గుండి జోజి అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదృశ్యమైన విద్యార్థుల్లోని ఒక విద్యార్థిని ఇంటి పక్కనే జోజి నివసిస్తున్నాడు.

విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జోజి కోసం పోలీసులు వాకబు చేయగా.. అతను సోమవారం మధ్యాహ్నం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జన శతాబ్ది ట్రైన్​లో చెన్నై వైపు వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి విద్యార్థినుల కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details