ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైంది- తులసిరెడ్డి

By

Published : Aug 14, 2020, 6:05 PM IST

ప్రభుత్వ కరోనా నివారణ చర్యలపై నమ్మకం లేక సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పక్క రాష్ట్రానికి వెళ్తున్నారని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

tulasi reddy on state governnment action on corona conntrol
తులసిరెడ్డి

కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కరోనా కట్టడిలో ఆ పార్టీ నాయకుల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.., చేతలు శూన్యమని ఆరోపించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 104,108 వాహనాలు ఎక్కడికిపోయాయో అర్ధం కావడం లేదన్నారు. సమయానికి అంబులెన్స్ లు రాక రోగులు మృత్యువాత పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కరోనా నివారణ చర్యలపై నమ్మకం లేక సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పక్క రాష్ట్రానికి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మాటలు మాని కరోనా కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుందన్నారు.

ఇదీ చదవండి: మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో కొనసాగింపు

ABOUT THE AUTHOR

...view details