కృష్ణా జిల్లా పామర్రులో మోటార్ సైకిల్ దొంగతనం చేయబోతూ.. ఓ దొంగ దొరికిపోయాడు. పామర్రు-గుడివాడ రోడ్డులోని ఓ మెకానిక్ షాప్ ముందు నిలిపి ఉన్న మోటార్ సైకిల్ దొంగిలించే ప్రయత్నంలో స్థానిక యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో నిందితుడి ఎండీ హుస్సేన్ బుడ్డా మచిలీపట్నం మండలంలోని ఇనకుదురుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఇతడు గతంలో కొన్ని మోటార్ సైకిళ్ల దొంగిలించిన కేసుల్లోనూ నిందితుడని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పామర్రు ఎస్సై తెలిపారు.