ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"కృష్ణా జిల్లాలో రెండున్నర లక్షల టన్నుల ఇసుక నిల్వలు" - కృష్ణా జిల్లాలో ఇసుక ఇబ్బందులు వార్తలు

కృష్ణా జిల్లాలో ఇసుక కొరత లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారిగా అధికారులు, నేతలతో ఇవాళ సమావేశమయ్యారు.

minister peddireddy

By

Published : Nov 22, 2019, 10:18 PM IST

మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఇంఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో ఇసుక కొరత లేదన్నారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్​గా ఆయన బాధ్యతలు తీసుకున్నాక మొదటి సారిగా సమావేశమయ్యారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై సుమారుగా రెండు గంటల పాటు చర్చలు జరిపారు. కనకదుర్గమ్మ వారధి నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో రెండున్నర లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని భయపడాల్సిన పనిలేదని మంత్రి అన్నారు. ఐదు నియోజకవర్గాల్లోని పంటపొలాలకు సాగునీరు కావాలని ఎమ్మెల్యేలు అడిగారని ఆయన తెలిపారు. ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details