కృష్ణాజిల్లా విజయవాడ మధురానగర్ బుడమేరు కట్టపై కొండచిలువ సంచారంతో స్థానికులు హడలిపోయారు. మధురానగర్ ఏలూరు కాల్వ బుడమేరు మద్యకట్ట రోడ్డులో వంతెనకు దగ్గరలో కొండచిలువను గుర్తించారు. వెంటనే కర్రలతో కొండచిలువను చంపే ప్రయత్నం చేసినా చనిపోకపోవడంతో ...ఇనుపరాడ్లతో కొండచిలువను చంపివేశారు. సుమారు పది అడుగుల ఉన్న కొండచిలువ కడుపునిండా ఆహారం తినడం వలన కదలలేని స్థితిలో ఉంది. అనంతరం కొందరు యువకులు ఆ కొండచిలువను భుజాలపై ఉంచుకొని తమ చరవాణిలో ఫోటోలు దిగారు. ఇటీవల వరదలతో కొండచిలువ వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
మధురానగర్లో కొండచిలువ హల్చల్... - Vijayawada.
ఎక్కడి నుంచి వచ్చిందో కాని... పది అడుగుల కొండచిలువ విజయవాడ మధురానగర్లో ప్రత్యక్షమైంది. భయంతో యువకులు కొండచిలువను ఇనుపరాడ్లతో కొట్టి చంపేశారు. అనంతరం కొండచిలువతో ఫొటోలు దిగారు.
The ten feet python was found in Vijayawada. The youngsters killed it with iron