రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇన్నాళ్లు భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించిన వైకాపా ప్రభుత్వం... ఇప్పుడు ఆలయ ఈవోలపై దృష్టిపెట్టింది. విజయవాడ దుర్గగుడి, అన్నవరం దేవస్థానం, కాణిపాకం ఆలయానికి కొత్త ఈవోలను నియమించింది. విజయవాడ దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసింది. ఆ స్థానంలో ఎం.వి.సురేశ్‌బాబు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అన్నవరం దేవాలయం ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అన్నవరం దేవస్థానం నూతన ఈవోగా త్రినాథరావును ప్రభుత్వం నియమించింది. అలాగే కాణిపాకం దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న పూర్ణచంద్రరావుకు స్థానచలనం కల్పించి.. తిరుపతి దేవదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో కాణిపాకం ఈవోగా వి.దేవుళ్లును ఎంపిక చేసింది. వీటితో విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా డి.భ్రమరాంబ నియమితులయ్యారు.