కృష్ణానదిలో చిక్కుకున్న రైతులు సురక్షితం - krishna river
పాపవినాశనం వద్ద వరదలో చిక్కుకున్న వారిని పోలీసులు సురక్షితంగా బయటకుతీసుకువచ్చారు. రెండు బొట్లలో పాపవినాశనం గ్రామం వైపు ఉన్న ఒడ్డుకు చేర్చారు. వీరిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద కృష్ణా నదిలో చిక్కుకున్న ఆరుగురిని పోలీసులు కాపాడారు. ఇవాళ ఉదయం పట్టుపురుగులకు మేత వేసేందుకు తెల్లవారుజామున 5.30 గంటలకు లంకకు వెళ్లిన వారు వరద నీటిలో చిక్కుకుపోయారు. నది ఒడ్డున ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ద్వారా సమాచారం తెలుసుకున్న చల్లపల్లి సీఐ వెంకట నారాయణ ఘటనా స్థలానికి వెళ్లారు. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన మత్స్య శాఖ అధికారులు, గజ ఈతగాళ్ల సాయంతో రెండు బోట్లలో రైతులకు వద్దకు చేరుకున్నారు. అనంతరం రైతులను సురక్షితంగా పాపవినాశనం గ్రామం వైపు ఉన్న ఒడ్డుకు చేర్చారు. వీరిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.