ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం మే 4కి వాయిదా - రాష్ట్ర మంత్రి మండలి సమావేశం

నేడు జరగాల్సిన కేబినెట్ భేటీని ప్రభుత్వం... మే 4కి వాయిదా వేస్తూ అత్యవసర నోట్ జారీ చేసింది. సమాచారాన్ని మంత్రులకు, ఆయా శాఖల కార్యదర్శులకు, అధికారులకు పంపాల్సిందిగా సూచించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం మే 4కి వాయిదా
ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం మే 4కి వాయిదా

By

Published : Apr 29, 2021, 3:55 AM IST


రాష్ట్ర సచివాలయంలో ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని మే 4 తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం అత్యవసర నోట్ జారీ చేసింది. సమాచారాన్ని మంత్రులకు , ఆయా శాఖల కార్యదర్శులకు, అధికారులకు పంపాల్సిందిగా సూచించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం కోవిడ్ 19 తీవ్ర పరిస్థితుల దృష్ట్యా కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మే 4 తేదీ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్​లో ఉన్న మంత్రిమండలి సమావేశ మందిరంలో కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం అత్యవసరంగా జారీ చేసిన నోట్​లో పేర్కోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్​కు కరోనా సోకటంతో పాటు ఆయన పూర్తిగా కోలుకోకపోవటంతోనే ఈ సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది. మరోవైపు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. మరో మంత్రి పుష్పవాణి కూడా ఆరోగ్య కారణాల వల్ల కేబినెట్ కు హాజరు కాలేకపోతున్నట్టు సమాచారం. దీంతో సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

ఇవీ చదవండి

హైకోర్టుకు తెదేపా : ప‌రీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ పిటిషన్‌

ABOUT THE AUTHOR

...view details