ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి - ఏపీలో కొవిడ్ కేసుల వార్తలు

సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా తగ్గి లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తున్న వేళ..రాష్ట్రంలోనూ కొవిడ్‌ కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ప్రాంతాల వారీగా నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. మండలాలు, పట్టణ ప్రాంతాలవారీగా యాక్టీవ్‌ కేసుల లెక్కలు తీస్తోంది.

కరోనా నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
కరోనా నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

By

Published : Jun 20, 2021, 4:38 AM IST

కరోనా నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి


రాష్ట్రంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తున్నా పాజిటివిటీ రేటు 10 శాతంగా నమోదు అవుతోంది. ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ దశలో వైరస్‌ను మరింత కట్టడి చేసేందుకు క్షేత్ర స్థాయి కార్యాచరణ సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలు, మండలాలు, అర్బన్‌ ప్రాంతాల వారీగా పాజిటివ్‌ కేసుల జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలో 68 మండలాల్లో వందకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా 196 మండలాల్లో 25 నుంచి 49 యాక్టివ్ కేసులు, అత్యల్పంగా 18 మండలాల్లో 4 కన్నా తక్కువ కరోనా కేసులు ఉన్నట్లు గుర్తించారు. 41 మండలాల్లో 5 నుంచి 9 కేసులు, 47 మండలాల్లో 20 నుంచి 24 మంది కరోనా బాధితులు చికిత్సపొందుతున్నారు. మరో 111 మండలాల్లో 50 నుంచి 74 మధ్య యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 74 మండలాల్లో 75 నుంచి 100 మధ్య కరోనా బాధితులు ఉన్నట్లు లెక్క తేల్చారు.

విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ వంటి నగరాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. అద్దంకి, కందుకూరు, పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో అతి తక్కువగా యాక్టివ్‌ కేసులున్నాయి. అద్దంకిలో 80, కందుకూరులో 72, పలాస-కాశీబుగ్గలో 69 యాక్టీవ్‌ కేసులు మాత్రమే ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రాంతాల వారీగాకేసులుఅంచనాతో వైరస్‌ కట్టడిపై ప్రత్యేకంగా దృష్టిసారించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి

Vaccine: రాష్ట్రానికి చేరుకున్న 5.16 లక్షల కొవిడ్ టీకా డోసులు

ABOUT THE AUTHOR

...view details