విజయవాడ నగర శివారు రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్ బాషా అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం మంగళగిరి ప్రాంతానికి చెందిన కొమిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి భాషా ఆటోలో వన్ టౌన్ ప్రాంతానికి ప్రయాణం చేశాడు. ఈ క్రమంలో అటోలో తన బ్యాగు మర్చిపోయాడు. బాషా కొంత సమయం తర్వాత ఆ బ్యాగును గుర్తించాడు. అందులో 70 వేల రూపాయల నగదు ఉండటంతో విజయవాడ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు సమాచారం అందించాడు.
శభాష్ ఆటో డ్రైవర్ అంటూ కితాబిచ్చిన పోలీసులు..ఎందుకుంటే
ఆటోలో ప్రయాణికుడు మర్చిపోయిన రూ.70వేల నగదు ఉన్న బ్యాగును పోలీసులకు అందించి నిజాయతీ నిరూపించుకున్నాడు డ్రైవర్. పోలీసులు ఆ డబ్బును ఆ ప్రయాణికుడికి అందించారు. ఈ సంఘటన విజయవాడలో జరిగింది.
నగదు బ్యాగ్ వెనక్కి ఇచ్చిన డ్రైవర్
సీఐ హనీష్ బ్యాగ్‌ను తనిఖీ చేసి అందులో ఉన్న అడ్రస్ ఆధారంగా వెంకటరెడ్డిని పిలిచి ఆటోడ్రైవర్ సమక్షంలోనే బ్యాగ్‌ను అప్పగించారు. ఆటోలకు గిరాకీ తక్కువగా ఉండటంతో డబ్బులు ఎంత అవసరం ఉన్నప్పటికీ.. నిజాయతీగా తనకు దొరికిన నగదు బ్యాగును అప్పగించడంపై పోలీసులు అభినందించారు.
ఇదీ చదవండి:స్పా ముసుగులో వ్యభిచారం.. ఆరుగురు అరెస్ట్