YSRCP leaders viral comments : కృష్ణాజిల్లాలో అధికార వైఎస్సార్సీపీ నేతల్లో అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. నేతల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు రాజుకుంటూనే ఉన్నాయి. గన్నవరం వైెఎస్సార్సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు సంభాషణలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతూ దుమారం రేపుతున్నాయి. ఒక ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్న సందర్బంలో వైఎస్సార్సీపీ నేతల మధ్య సంభాషణ సాగింది.
మాజీ మంత్రి కొడాలి నాని సహా ఎమ్మెల్యే వంశీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొడాలి నానిపై చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏ సినిమాలోనైనా హీరో కంటే విలన్‌కే ఎక్కువ క్రేజ్ ఉంటుందని.. నియోజకవర్గానికి ఎందుకైనా ఉపయోగపడతారా..? అంటూ మాట్లాడారు. వల్లభనేని వంశీ, కొడాలి నానికి ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారని, ప్రశ్నించారు.