ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HC orders to School Education Secretary: వ్యక్తిగతంగా హాజరుకావాలి.. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు - ఎయిడెడ్‌ పాఠశాల

HC orders to School Education Secretary: పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. ఎయిడెడ్‌ ఖాళీల భర్తీకి యాజమాన్యాలు ఇటీవల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగా.. హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనమంటూ ఆదేశాలు జారీ చేసింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 28, 2023, 4:36 PM IST

HC orders to School Education Secretary: పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో పాఠశాల యాజమాన్యాలు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది శ్రీవిజయ్‌ వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోగా వాటిని నిర్వీర్యంచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 2013 నుంచి నేటి వరకూ విద్యాశాఖలో పనిచేసిన అధికారులు దీనికి బాధ్యత వహించల్సి ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఎయిడెడ్ స్కూళ్లపై నిర్లక్ష్యం.. ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై కత్తి కట్టిన ప్రభుత్వం.. వాటి మూసివేతకు చర్యలు తీసుకుంటోంది. 30లోపు విద్యార్థులున్న ప్రాథమిక బడుల విలీనంతో పాటు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపడుతోంది. దీంతో కొత్త నియామకాలకు ఫుల్​స్టాప్ పడడంతో పాటు బోధనకు మూడేళ్లపాటు ఒప్పంద ఉపాధ్యాయులే గతి. రాష్ట్ర వ్యాప్తంగా 1,988 ఎయిడెడ్‌ పాఠశాలలకు గాను 88 యాజమాన్యాలు గతంలో ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించాయి. ఎయిడెడ్‌ పాఠశాలల్లో కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల నియామకాలు లేవు. దీంతో చాలా చోట్ల భారీగా ఖాళీలు ఉండగా.. యాజమాన్యాలు ప్రైవేటు టీచర్లతో.. కొన్నిచోట్లఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ సెక్షన్లతో ఇబ్బందులను అధిగమిస్తున్నాయి. ఎయిడెడ్‌ ఖాళీల భర్తీకి యాజమాన్యాలు ఇటీవల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగా... హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనమంటూ ఆదేశాలు జారీ చేసింది. హేతుబద్ధీకరణ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు తగ్గిపోవడంతో పాటు కొత్తగా నియామకాలు చేపట్టాల్సి వచ్చినా మూడేళ్లపాటు కాంట్రాక్టు సిబ్బందినే పెట్టుకోవాలనే నిబంధన తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులున్నా ఒక టీచర్‌ను ఇచ్చి కొనసాగిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఎయిడెడ్‌కు వచ్చేసరికి 30 మంది లోపు విద్యార్థులు ఉంటే విలీనానికి సిద్ధమైంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 30 మంది లోపు పిల్లలు ఉన్న ప్రాథమిక పాఠశాలలను కిలోమీటరు దూరంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. పూర్వ పాఠశాలల టీచర్లను మిగులుగా చూపి.. అవసరమైన చోట సర్దుబాటు చేయనుంది.

ఆర్థిక భారం తగ్గించుకునేందుకు.. రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థల నిర్వీర్యానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థిక భారం తగ్గించుకోవడంతోపాటు ఆస్తులపైనా కన్నేసిన ప్రభుత్వం.. హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొంతకాలం మౌనంగా ఉన్న ప్రభుత్వం.. అడ్మిషన్లు తగ్గిన ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేసేలా ఆదేశాలు ఇచ్చింది. మరికొన్నింటికి హెచ్చరికలు చేయడంతో మరో ఏడాది సమయం కావాలంటూ యాజమాన్యాలు కోరడంతో వెనక్కి తగ్గింది.

ABOUT THE AUTHOR

...view details