కృష్ణా జిల్లాలో రెన్యువల్ కాని మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు... అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న మద్యం దుకాణాలకు మూడు నెలల పాటు గడువు పొడిగించారు. ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు.. షాపుల కోసం అద్దె ఇళ్లు, రవాణా కాంట్రాక్టరు కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చిన దరఖాస్తులను సంయుక్త కలెక్టరు మాధవీలత ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు పరిశీలించారు. అద్దె ఖరారు చేశారు.అనంతరం లిఖిత పూర్వకంగా ఒప్పందాలు చేసుకున్నారు.
రెన్యువల్ కాని మద్యం దుకాణాలు.. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే! - non-renewable liquor stores
రెన్యువల్ కాని మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు వివిధ పనులకు అధికారులు టెండర్లను ఆహ్వానించారు.
The authorities invited tenders for operate non-renewable liquor stores in krishna distrct under state control