ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gudivada Tension : గుడివాడలో వేడెక్కిన రాజకీయం.. వైకాపా, తెదేపా పరస్పర ఫిర్యాదులు - ఏపీ తాజావార్తలు

Gudivada Tension: కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఆదివారం తెలుగుదేశం నేతలు చేసిన ఆందోళనకు నిరసనగా గుడివాడలో వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. గుడివాడ వైకాపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి నెహ్రూ సెంటర్​కు వెళ్లేందుకు వైకాపా శ్రేణులు ర్యాలీగా బయలుదేరగా మార్కెట్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా మార్కెట్ సెంటర్ లో వైకాపా శ్రేణులు ధర్నా చేపట్టారు.

Gudivada YCP
గుడివాడలో తెదేపా వర్సెస్ వైకాపా

By

Published : Sep 12, 2022, 3:51 PM IST

Tension in Gudivada: రాష్ట్రంలో గుడివాడ రాజకీయాలు వేడిని రాజేస్తున్నాయి. తమ నేత చంద్రబాబు, లోకేశ్​​పై.. మాజీ మంత్రి, వైకాపా నేత కొడాలి నాని అనుచిత వాఖ్యలు చేశారంటూ.. తెదేపా నాయకులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నేతను తెదేపా నేతలు అసభ్యపదజాలంతో దూషించారంటూ ఈరోజు వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఆదివారం టీడీపీ నేతలు చేసిన ఆందోళన కార్యక్రమాలకు కౌంటర్​గా గుడివాడ వైకాపా నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గుడివాడ వైకాపా కార్యాలయం నుండి భారీ ర్యాలీగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పార్టీ శ్రేణులు జై కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు.

కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ వైకాపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుండి నెహ్రూ సెంటర్​కు వెళ్లేందుకు వైకాపా శ్రేణులు ర్యాలీగా బయలుదేరగా.. మార్కెట్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా మార్కెట్ సెంటర్​లో వైకాపా శ్రేణులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తమ నాయకుడు కొడాలి నాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వైకాపా నేతలు హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details