రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీల జీవో అసంబద్ధంగా ఉందని, బదిలీల్లో మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ... విజయవాడ ధర్నా చౌక్‌లో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.
'ఉపాధ్యాయ బదిలీల్లో మ్యాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టాలి'
విజయవాడలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీల జీవో అసంబద్ధంగా ఉందని ఆరోపించారు. బదిలీ ప్రక్రియలో మ్యాన్యువల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో ఉపాధ్యాయులు ఆందోళన
తమ సమస్యలను విద్యాశాఖ మంత్రి పరిష్కరిస్తానని హామీ ఇచ్చి... ప్రస్తుతం వాటిని చేపట్టడం లేదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు నారాయణరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీల వివరాలను తెలపాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి.