అత్యాచార కేసులో నిందితులను శిక్షించాల్సిన వైకాపా ప్రభుత్వం... వాళ్లను రక్షిస్తోందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. చట్టాలతో మహిళలకు రక్షణ కల్పించకపోవడం ప్రభుత్వ తప్పిదమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోడం ప్రభుత్వ పాలన వైఫల్యం, రాష్ట్రంలో జరుగుతున్న దుర్మర్గాలకు అద్దం పడుతోందని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు
దిశ చట్టంలో లోపాలు ఉన్నాయని కేంద్రం తిప్పి పంపితే మంత్రులు, ముఖ్యమంత్రి మాత్రం ఇంకా ఆ చట్టం పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. మహిళ హోం మంత్రి నియోజకవర్గంలో జరిగిన అఘాయిత్యం కేసులో బాధితులకు న్యాయం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.