తిరుపతి ఉప ఎన్నికలో బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్... ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వైకాపా నేతలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్టిని మళ్లించేందుకే హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యవహార శైలిని తప్పుబట్టారు.
'మండలిని రద్దు చేస్తామని చెప్పి.. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామంటారా?' - tdp spoke person divyavani latest news
తిరుపతి ఉపఎన్నికలో దుర్గాప్రసాద్ కుటుంబానికి ఉప ఎన్నిక టిక్కెట్ ఇవ్వకపోవటంపై తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో వైకాపా నేతలకు ఉన్న వ్యతిరేకతపై దృష్టి మరల్చటానికి హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.
తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి