దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నిస్తున్నారని కృష్ణా జిల్లా తెదేపా నేతలు ఆరోపించారు. జగన్‌కు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలంటూ కోడూరులో ర్యాలీ చేశారు.ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకి అయిన కేసీఆర్ తో జతకట్టి.. జగన్ దొంగ దారిన ఓట్లను తొలగించి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం కోడూరు తహశీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ప్రతిపక్ష నేత జగన్ ప్రధాని మోదీతో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు.