భాజపా తమ పార్టీ గుర్తును ఏపీ ప్రజల చెవులో పెడుతోందని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లురవీంద్ర దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా, అమరావతి అంశాల్లో కేంద్ర పెద్దల మాటలకు, స్థానిక భాజపా నేతలు చెప్పేదానికి పొంతన లేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భాజపా ప్రజల చెవిలో పువ్వులు పెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లా శ్రీనివాస్ దీక్షను భగ్నం చేసే యత్నాన్ని తీవ్రంగా ఖండించినట్లు తెలిపిన ఆయన.. చంద్రబాబు విశాఖ పర్యటన ఉన్నందునే పల్లా శ్రీనివాస్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకోలేని ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి చర్యలకు దిగడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వైకాపా ఎంపీలకు దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సవాల్ విసిరారు.
'భాజపా నేతలు వారి పార్టీ గుర్తును ప్రజల చెవిలో పెడుతున్నారు'
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుందని కేంద్ర పెద్దలు చెప్తుంటే, సోము వీర్రాజు, మాధవ్ ప్రజల్ని మభ్య పెడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లురవీంద్ర విమర్శించారు. పల్లా శ్రీనివాస్ దీక్షను భగ్నం చేసే యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లురవీంద్ర