పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు కృష్ణా జిల్లా విజయవాడలో తమ తమ నివాసాల వద్ద నిరసన దీక్ష చేపట్టారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక ప్రజలు ఓ పక్క ఇబ్బందులు పడుతుంటే జగన్ విద్యుత్ షాక్ ఇచ్చారని మండిపడ్డారు.
విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని తెదేపా నిరసన
పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు విజయవాడలో తమ తమ నివాసాల వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో నిరసన
రెండు ఫ్యాన్లు, రెండు బల్బులు, ఒక టీవీ ఉన్న సామాన్యులకు సైతం 3 వేల రూపాయల వరకు బిల్లులు వచ్చాయని ధ్వజమెత్తారు. తక్షణమే లాక్డౌన్ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'ఆర్టీసీ ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి'