ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్ ప్రభుత్వం మానవత్వం మరిచి రైతులకు సంకెళ్లు వేసింది' - krishnayapalem sc farmers latest news

ఎస్సీ రైతులకు జగన్ ప్రభుత్వం మానవత్వం మరిచి సంకెళ్లు వేసి జైల్లో పెట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రైతులు లోకేశ్​తో సమావేశమై కన్నీటి పర్యంతమయ్యారు. అన్ని విధాలా అండగా ఉంటానని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.

nara lokesh
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

By

Published : Nov 27, 2020, 3:45 PM IST

కృష్ణాయపాలెం ఎస్సీ రైతులకు జగన్ ప్రభుత్వం మానవత్వం మరిచి సంకెళ్లు వేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని బెయిల్ పై ... విడుదలైన రైతులు లోకేశ్​తో చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. వారికి అండగా నిలుస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసినవారే కంప్లైంట్ వెనక్కి తీసుకున్నా రైతులకు సంకెళ్లు వేయించటం బాధాకరమన్నారు. దాడులు దౌర్జన్యాలెన్నో భరిస్తూ ఎంతకాలమైనా వెన్నుచూప‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ ఉద్యమానిదే... అంతిమ విజ‌యమని లోకేశ్ స్పష్టం చేశారు. రైతుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నం పెట్టే అన్నదాతలు భూతల్లిని... రాజధాని కోసం త్యాగం చేశారని కొనియాడారు. అమ‌రావ‌తిని చంపేసే కుట్రల్ని నిర‌సిస్తూ శాంతియుతంగా ఉద్యమిస్తున్నవాళ్లని ప్రభుత్వం అణగదొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీల‌పైనే ఎస్సీ, ఎస్టీ కేసు జగన్ రెడ్డి పెట్టించారని లోకేశ్ ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details