ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాణిపై దాడిని ఖండించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్

విజయవాడ మూడో డివిజన్ తెదేపా అభ్యర్థి కొందపనేని వాణిపై గుణదలలో జరిగిన దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఖండించారు. రాష్ట్రంలో మహిళ సాధికారత దుస్థితికి ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు.

By

Published : Feb 16, 2021, 11:59 PM IST

Updated : Feb 17, 2021, 2:25 AM IST

వాణిపై దాడిని ఖండించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
వాణిపై దాడిని ఖండించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్

విజయవాడ మూడో డివిజన్ తెలుగుదేశం అభ్యర్థి కొందపనేని వాణిపై గుణదలలో జరిగిన దాడిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మహిళపై జరిగిన దాష్టీకాన్ని ఆయున ఖండించారు. రాష్ట్రంలో మహిళ సాధికారత దుస్థితికి వైకాపా పాలన నిదర్శనమని అసంతృప్తి వ్యక్తం చేశారు.

వైకాపా దాడి..

తెదేపా అభ్యర్థి కొందపనేని వాణిపై గుణదలలో దాడి జరిగింది. వైకాపా వర్గీయులు తనపై దాడి చేశారని బాధితురాలు వాణి ఠాణాలో ఫిర్యాదు చేశారు. సన్నిహితులతో కలిసి ప్రచారం చేస్తుండగా అధికార పార్టీకి చెందిన అవినాష్ వర్గీయులు దాడి చేసినట్లు పేర్కొన్నారు. తమ కుమారుడ్ని కత్తితో పొడవబోతే స్థానికులు అడ్డుకున్నారని వాణి వివరించారు. అభ్యర్థిణిపై జరిగిన దాడిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా సైతం ఖండించారు.

ఇదీ చదవండి

ఈనెల 23న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్​ భేటీ

Last Updated : Feb 17, 2021, 2:25 AM IST

ABOUT THE AUTHOR

...view details