రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెదేపా ఎంపీ కనకమేడల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ విభజన అన్యాయంగా జరిగిందని స్వయంగా ప్రధానే చెప్పినా.. వైకాపా ఎందుకు పోరాడడంలేదని ప్రశ్నించారు. దిల్లీలో మాట్లాడిన ఆయన.. కేసుల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెడతారా? అని నిలదీశారు.
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ విభజనపై గత మంగళవారం(ఫిబ్రవరి 8) రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారన్నారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని వ్యాఖ్యనించారు.