మంత్రి బాలినేనిపై తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాలినేని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తున్నా.. పోలీసులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఎన్నికల్లో బాలినేని రణరంగం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
కొందరు పోలీసులు, అధికారులు చట్ట విరుద్ధంగా పని చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి స్వగ్రామమైన కొణిజేడులో.. ఇతర ప్రాంతాల వారితో ప్రత్యర్థి అభ్యర్థులపై దౌర్జన్యం చేయటం దుర్మార్గమన్నారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే... వారికి సహకరించటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.