రాష్ట్రంలో దళితులపై దాడులకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. 65 నియోజకవర్గ కేంద్రాలు, 132 మండల కేంద్రాల్లో నిరసనలు ఈ నిరసనలు కొనసాగాయి. అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు, వినతిపత్రాలు, బైఠాయింపులు... ఇలా పలు విధాలుగా ఈ నిరసనలు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా 13 జిల్లాలలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులను వారు ఖండించారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా దళితులపై ఇన్ని అఘాయిత్యాలు జరిగాయా అని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.