వైకాపా పాలనలో ప్రజలపై పన్నుల మోత పడిందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పన్నులు, ఛార్జీల పెంపుతో 70 వేల కోట్ల రూపాయల భారం మోపినట్లు తెలిపారు. పట్టణ భూముల విలువ పెంపుతో ప్రజలపై 8 వందల కోట్ల భారం పడుతుందన్న యనమల.. ఆస్తి పన్ను 15 శాతం పెంపుతో 8వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నారన్నారు. విద్యుత్ బిల్లులు పెంచి 3 వేల కోట్ల రూపాయల భారం మోపారని విమర్శించారు. నిత్యావసరాల ధరలు 200 శాతం నుంచి 300 శాతానికి పెంచేశారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా పాలనలో ప్రజలపై పన్నుల మోత: యనమల - తెదేపా నేత యనమల రామకృష్ణుడు తాజా వార్తలు
వైకాపా పాలనలో ప్రజలపై పన్నుల మోత, ఛార్జీల భారం మోపుతున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. పన్నులు, ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.70 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. పట్టణ భూముల విలువ పెంపుతో ప్రజలపై రూ.800కోట్ల భారం మోపారని దుయ్యబట్టారు.

tdp leader yanamala fire on cm jagan
ఇదీ చదవండి:రైతుల రెక్కల కష్టం నీళ్ల పాలు