విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీకి జగన్ 307 కోట్ల రూపాయలు దోచిపెట్టటంపై... సమాధానం చెప్పేందుకు రోజాకు దమ్ముందా అంటూ వంగలపూడి అనిత సవాల్ విసిరారు. బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి తగ్గించటంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టూవీలర్ అంబులెన్స్, తల్లీ-బిడ్డ ఎక్స్ప్రెస్, మహాప్రస్థానం అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. 108 వాహన డ్రైవర్లకు హెవీ వెహికల్ లైసెన్స్ లేకుండా ఏవిధంగా నడుపుతారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక కావటంతోనే... వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టేందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
'సమాధానం చెప్పే దమ్ము రోజాకు ఉందా?- వంగలపూడి అనిత' - vangalapudi anitha on roja
ఎమ్మెల్యే రోజాపై తెదేపా నేత వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 307 కోట్ల రూపాయలను దోచిపెట్టటంపై సమాధానం చెప్పే దమ్ముందా అంటూ రోజాకు సవాల్ విసిరారు.
తెదేపా నేత వంగలపూడి అనిత