ఇద్దరు సీఎంల మూర్ఖత్వంతోనే కేంద్ర ప్రభుత్వం నీళ్ల మీద పెత్తనం చేజిక్కించుకుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య బంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు, స్నేహాలు సజీవంగా ఉన్నాయని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కట్టిన ప్రాజెక్టుల మీదకు మన ఇంజనీర్లు వెళ్లాలంటే.. సీఐఎస్ఎఫ్ బలగాల అనుమతి కావాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
water war: సీఎంల తీరుతోనే కేంద్రం పెత్తనం: సోమిరెడ్డి - పోలవరం ప్రాజెక్ట్
ఇద్దరు సీఎంల మొండివైఖరి వల్ల నీళ్ల మీద పెత్తనం కేంద్రప్రభుత్వం చేస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కట్టిన ప్రాజెక్టుల మీదకు మన ఇంజనీర్లు వెళ్లాలంటే.. సీఐఎస్ఎఫ్ బలగాల అనుమతి తీసుకోవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరకు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్..రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసే ప్రమాదం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. వెలిగొండ ప్రాజెక్టును మాత్రం విస్మరించి.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ లాంటి చిన్న ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పెత్తనమేంటని ఆయన నిలదీశారు. వీటిపై రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లావాసులు లోతుగా చర్చించి ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి.'అవి.. బోర్డు పరిధిలోకి అవసరం లేదు': కేంద్ర గెజిట్‌పై సీఎం జగన్