బీసీలను సీఎం జగన్ ఓటు బ్యాంకుగానే చూస్తూ .. రిజర్వేషన్ల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించడానికి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు. సత్వరం కొత్త ఆర్డినెన్స్ విడుదల చేయాలన్నారు. ఎవరైనా కోర్టుకు వెళితే మంచి లాయర్లను పెట్టి బలమైన వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు.
వచ్చే రెండు, మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశం లేనందున ప్రభుత్వానికి కలిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. బీసీ ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై ఆలోచన చేయాలని.. ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని కాల్వ పిలుపునిచ్చారు.