వైకాపా ప్రభుత్వం తితిదే ద్వారా హిందూ వ్యతిరేక ధోరణిని వ్యాపింపచేయాలని చూస్తోందని తెలుగుదేశం ఎన్నారై కో ఆర్డినేటర్ బుచ్చిరామ్ ప్రసాద్ ఆరోపించారు. తితిదే వెబ్సైట్లో అన్యమత బోధనలు, కీర్తనలు పెట్టారని మండిపడ్డారు. తితిదే ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న సప్తగిరి మాసపత్రిక స్థానంలో క్రైస్తవ పత్రికను పంపడాన్ని తీవ్రంగా ఖండించారు.
వైకాపా ప్రభుత్వం తితిదే ద్వారా అన్యమత ప్రచారం చేయాలని చూస్తోంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తిరుమల కొండపై అన్యమత ప్రచార పోస్టర్ల ఆరోపణలు, స్వామివారి భూములు అమ్మాలనుకోవడం, సప్తగిరి మాసపత్రిక బదులు క్రైస్తవ ప్రచారం పుస్తకం పంపడం.. ఇలాంటివన్నీ చూస్తుంటే హిందూ వ్యతిరేక ధోరణిని వ్యాపింపజేయాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. -- బుచ్చిరాం ప్రసాద్, తెదేపా నేత