ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 16, 2021, 12:44 PM IST

ETV Bharat / state

BONDA UMA: 'రోజుకి ఇసుకపై వైకాపా రూ.300 కోట్లపైనే దోచేస్తోంది'

వైకాపా ప్రభుత్వం ఇసుక మాఫియాకు లైసెన్స్ ఇచ్చిందని తెదేపా పోలిట్ బ్యూర్ సభ్యులు బోండా ఉమా విమర్శించారు. రోజుకి ఇసుకపై వైకాపా రూ.300 కోట్లపైనే దోచేస్తోందని ధ్వజమెత్తారు. కృష్ణాజిల్లా చెవిటికల్లులో వైకాపా ఇసుక మాఫియా మీడియా సాక్షిగా దొరికిపోయిందని ధ్వజమెత్తారు. అక్రమంగా నది గర్భంలోని ఇసుకను తోడేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

bonda uma
బోండా ఉమా

కృష్ణాజిల్లా చెవిటికల్లులో వైకాపా ఇసుక మాఫియా మీడియా సాక్షిగా దొరికిపోయిందని ధ్వజమెత్తారు. వందల లారీలతో ఇసుకను పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తూ లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. చెవిటికల్లులో అక్రమ ఇసుకను తీసుకువెళ్తున్న లారీలను కేసు పెట్టకుండా వదిలేశారని ఆరోపించారు. అక్రమంగా నది గర్భంలోని ఇసుకను తోడేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని తాము గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టుల దృష్టికి తీసుకువెళ్తామని బోండా ఉమా అన్నారు. తెదేపా హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకను వైకాపా రూ.30 వేలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకి ఇసుకపై వైకాపా రూ.300 కోట్లపైనే దోచేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొన్న ఇసుకకి బిల్లు కూడా ఇవ్వటం లేదంటే దోపిడీ ఎలా వుందో అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలో విజిలెన్స్, పోలీసు, సీబీసీఐడీలను ప్రత్యర్థులను వేధించడానికే పరిమితమయ్యాయని మండిపడ్డారు.

ఇదీ చదవండి

RESCUE OPERATION: కృష్ణానదిలో చిక్కుకున్న 132 లారీలు, 4 ట్రాక్టర్లు సేఫ్​

ABOUT THE AUTHOR

...view details