గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న నకిలీ పెస్టిసైడ్స్ దందాను కృష్ణా జిల్లా విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి నాలుగున్నర కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ పురుగుల మందులు ,రసాయన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. సిన్ జెంటా ఆగ్రో కెమికల్ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఉన్న నకిలీ ఉత్పత్తులను ఓ ముఠా తయారు చేస్తోంది. గుంటూరు జిల్లా పెదకాకాని కేంద్రంగా ఈ అక్రమ వ్యాపారాన్ని వారు కొనసాగిస్తున్నారు.
నకిలీ పురుగులమందుల ముఠా గుట్టురట్టు
గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న నకిలీ పెస్టిసైడ్స్ దందాను కృష్ణా జిల్లా విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నకిలీ ఉత్పత్తులను తయారు చేసి రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ముఠా ఆటకట్టించిన విజయవాడ టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి .
విజయవాడలో నకిలీ పురుగులమందుల ముఠా గుట్టురట్టు