తెలంగాణ ప్రాంతంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలోని తమ్మిలేరు వంతెన తెగిపోయింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చిన్నపేట గ్రామం వద్ద తమ్మిలేరు వంతెన దెబ్బతింది. ప్రతి ఏడాది అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు కానీ..వంతెన పొడవు, వెడల్పు పెంచి శాశ్వత పరిష్కారం చూపటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా కంకర, ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. వంతెన తెగిపోవడం వల్ల కృష్ణా-పశ్చిమ గోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వరదతో తెగిన తమ్మిలేరు వంతెన..రాకపోకలకు అంతరాయం - ఏపీలో వర్షాల తాజా వార్తలు
ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమ్మిలేరు వంతెన తెగిపోయింది. దీంతో కృష్ణా-పశ్చిమ గోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వరదతో తెగిన తమ్మిలేరు వంతెన..రాకపోకలకు అంతరాయం !