కృష్ణాజిల్లా అవనిగడ్డ గ్రామంలోని శానిటేషన్ పని వారు చాలా తక్కువగా ఉన్నారని, శివారు గ్రామాలకు శానిటేషన్ చేసేందుకు సిబ్బంది సరిపోవటం లేదని స్థానిక తెలుగు దేశం నేతలు పేర్కొన్నారు. అవనిగడ్డలో కోవిడ్ 19 వ్యాధికి సరైన నివారణ చర్యలు చేయాలని అవనిగడ్డ మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారికి తెదేపా నేతలు వినతి పత్రం అందజేశారు.
తాత్కాలిక పద్ధతిపై కరోనా వైరస్ వర్కర్లను నియమించి అవనిగడ్డలో కరోనా వైరస్ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయ సిబ్బంది పథకాల అమలులో చాలా అవకతవకలకు పాల్పడుతున్నారని.. పరోక్షంగా డబ్బులు అడుగుతున్నారని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. వారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కొరారు.