ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిసరాల పరిశుభ్రత కోసం 'స్వచ్ఛ మసూలా' - krishna

మచిలీపట్నం పట్టణాన్ని స్వచ్చంగా తీర్చిదిద్దేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమాన్ని చేప్టటారు. స్వచ్ఛ మసూలా పేరుతో పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

పరిసరాల పరిశుభ్రత కోసం 'స్వచ్ఛ మసూలా'

By

Published : May 13, 2019, 11:40 AM IST

పరిసరాల పరిశుభ్రత కోసం 'స్వచ్ఛ మసూలా'

కృష్ణా జిల్లా మచిలీపట్నాన్ని స్వచ్ఛమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ మసూలా పేరుతో కలెక్టర్ ఇంతియాజ్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యర్ధ పదార్ధాలను రోడ్లపై వేయడం వల్ల పర్యావరణం కలుషితమవుతోందని పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పించారు. తాగే చెరువు నీటిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు వేస్తున్నారని దీని వల్ల ఆరోగ్యానికి హాని కులుగుతుందన్నారు. నెలకు రెండు రోజులు స్వచ్ఛ మసూలా కార్యక్రమంలో పాల్గొని పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details