ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తి మెడ భాగంలో దిగిన ఇనుపకడ్డీ... రక్షించిన సన్ రైజ్ వైద్యులు

మెడభాగం నుంచి చెవిలోకి ఇనుపకడ్డీ గుచ్చుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని సన్ రైజ్ ఆసుపత్రి వైద్యులు రక్షించారు. అధునాతన తరహాలో శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. తన కుమారుడిని రక్షించినందుకు బాధితుడి తండ్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

By

Published : Nov 20, 2020, 7:49 AM IST

Sunrise Hospital Rare Operation
Sunrise Hospital Rare Operation

కృష్ణాజిల్లా మూలపాడుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి అర్ధరాత్రి ఇంటి మెట్లెక్కుతూ జారి.. ఇనుపసువ్వలపై పడ్డాడు. ఈ ఘటనలో ఇనుపసువ్వ మెడ భాగం నుంచి చెవిలోకి దూసుకెళ్లింది. అర్థరాత్రి సమయంలో బాధితుణ్ని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. సన్ రైజ్ ఆసుపత్రి సిబ్బంది వెంటనే చికిత్స అందించారు. వివిధ పరీక్షలు చేసి లాప్రోస్కోపి ద్వారా చికిత్స చేయాలని నిర్ణయించారు.

ఈఎన్​టీ వైద్యులు డా. నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం నాలుగు గంటలు శ్రమించి ఇనుప చవ్వను తీశారు. అయితే మెదడుకు సంబంధించిన నరం పక్క నుంచి చువ్వ వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. బాధితుడి స్వరపేటిక దెబ్బతిందని... ఓ కంటికి పక్షవాతం వచ్చిందని వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామకృష్ణను వైద్య బృందం శ్రమించటంతో రక్షించకలిగామన్నారు.

ప్రస్తుతం రామారావు మెల్లమెల్లగా కోలుకుంటున్నాడని... ఇంకా మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని డా. నరేంద్ర తెలిపారు. కరోనా సమయంలో ఈ తరహా శస్త్రచికిత్స చేయటం కత్తిమీద సాములాంటిదన్నారు. ప్రాణాపాయంలో ఉన్న తమ కుమారుణ్ని రక్షించారని బాధితుడి తండ్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజులు వసూలుకు సిద్ధమైన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details