ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేసవి తీవ్రత తో ముందస్తు రక్షణ చర్యలు - people

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రమేశ్ సూచించారు.

వేసవి తీవ్రత తో ముందస్తు రక్షణ చర్యలు

By

Published : Apr 25, 2019, 4:58 AM IST

వేసవి ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న సమయంలో సీజన్ అంతా తీవ్రమైన పరిస్థితులు నెలకొంటాయనన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈసారి వేసవి మరింత ఠారెత్తిస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయువ్య భారత్ నుంచి కోస్తాంధ్ర వరకూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఉన్న ఎండలతో విజయవాడ నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండకు భయపడి జనం బయటకు రాలేకపోతున్నారు. ఏప్రిల్ కావటంతో ఎండల తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం 1 నుంచి 3గంటల వరకూ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రోడ్డు నుంచి వేడివేడి సెగలకు తోడు వడగాలుల తీవత్ర ఎక్కువగా ఉంటోంది.

వేసవి తీవ్రత తో ముందస్తు రక్షణ చర్యలు
ప్రతిరోజు 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే ముగిసే నాటికి ఎండల తీవ్రత ఇంకెత పెరుగుతుందోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.ఎండ తీవ్రత చూస్తుంటే 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రమేశ్ సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కావల్సిన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేశామని తెలిపారు. పంచాయతీ, అంగన్వాడీ కార్యాలయాల్లోనూ మందుల్ని సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకూ వడదెబ్బ బాధితుల నమోదు ఎక్కువగా లేనప్పటికీ తామంతా సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. ప్రజలంతా తమతో సహకరిచాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details