ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మునుకుల్లలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - Suicide of a farmer's suicide in munakallu

ఓ కౌలు రైతన్న కుటుంబంలో విషాదం నింపింది. వ్యవసాయం భారమై..అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకి ప్రాణాలు వదిలిన ఘటన కృష్ణాజిల్లా మునుకల్లులో జరిగింది.

మునుకుల్లలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

By

Published : Sep 23, 2019, 9:38 AM IST

మునుకుల్లలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

కృష్ణాజిల్లా తిరువూరు మండలం మునుకుల్లలో ఓ కౌలు రైతు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుబ్బాక రాము పదేళ్లుగా భూములను కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశారు. వాతావరణ పరిస్థితుల సహకరించక పంట దిగుబడి తగ్గింది. వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల భారం పెరిగింది. వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి పెరిగింది. తట్టుకోలేని రాము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details