ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Students concern: ఎయిడెడ్ కళాశాలను ప్రైవేటుపరం చేయవద్దంటూ.. విద్యార్థుల ఆందోళన

కృష్ణా జిల్లా(krishna district) నందిగామలో కేవీఆర్ ఎయిడెడ్ కళాశాలను ప్రైవేటుపరం చేయవద్దంటూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన(Students concern) చేపట్టారు. ఎయిడెడ్ కాలేజీని ప్రైవేటీకరిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Students concern
Students concern

By

Published : Nov 3, 2021, 5:26 PM IST

ఎయిడెడ్ కళాశాలను ప్రైవేటుపరం చేయవద్దంటూ... విద్యార్థల ఆందోళన

కృష్ణాజిల్లా(krishna district) నందిగామలోని కె.వి.ఆర్ కళాశాలను(KVR Aided College ) ప్రైవేటుపరం చేయొద్దని విద్యార్థులు ఆందోళన (Students concern)చేపట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలగా సేవలందిస్తున్న కాకాని వెంకటరత్నం కళాశాలను.. ప్రవేటీకరిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఎస్ఎఫ్ఐ(sfi), ఏఎస్ఎఫ్ఐ(asfi) ఆధ్వర్యంలో విద్యార్థులు.. కేవీఆర్ కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ(rally) నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.

కేవీఆర్ కళాశాలను ఎయిడెడ్‌ కళాశాలగానే కొనసాగించాలని, పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

చిట్టీ డబ్బు ఇప్పించాలంటూ.. బాధితుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details