ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP: 'జగన్ పాలనలో ఉత్తరాంధ్ర విధ్వంసం.. చంద్రబాబు హయాంలో కాపులకు స్వర్ణయుగం' - traitor Jagan Reddy

Uttarandhra traitor Jagan Reddy : సీఎం జగన్ రెడ్డి నాలుగేళ్లలో ఉత్తరాంధ్ర విధ్వంసానికి పాల్పడ్డాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రుషికొండను బోడిగుండు చేశారని, పోర్టులను ధారాదత్తం చేశాడని మండిపడ్డారు. ఇక.. కాపు నాయకులు జగన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబును విమర్శిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 3, 2023, 4:12 PM IST

Uttarandhra traitor Jagan Reddy : ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ రెడ్డి అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తన అవలక్షణాలను ఎదుటివారికి అంటగట్టడం జగన్ రెడ్డి నైజమని మండిపడ్డారు. దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే దోపిడీకి నిలువెత్తు రూపం జగన్ రెడ్డి అని విమర్శించారు. విశాఖలో 40వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఉత్తరాంధ్ర విధ్వంసం..పోలవరం నాశనం చేశాడు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నిర్వీర్యం చేశాడని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ స్లాంట్ అమ్మకానికి పరోక్షంగా సహకరిస్తున్నాడని, రుషికొండను బోడిగుండు చేశాడని, పోర్టులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ లేదు, భోగాపురం ఎయిర్ పోర్ట్ భూముల్లో 500 ఎకరాలు కొట్టేయడానికి రిజర్వ్ చేసుకున్నాడని ఆరోపించారు. జీవో నంబర్ 3 ద్వారా ఆదీవాసీల ప్రయోజనాలకు గండి కొట్టాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

పేదల ధనం దోపిడీ.. పేదలకు 10 రూపాయలు ఇచ్చి.. 100 రూపాయలు కొట్టేస్తున్నాడని ధ్వజమెత్తారు. రూ.6 లక్షల కోట్లు అప్పు చేసి 4 ఏళ్లల్లో 2 లక్షల కోట్లే డీబీటీకి ఇచ్చారని, మిగిలిన రూ.4 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు పన్నులు, ఛార్జీలు, ధరలు పెంచకుండా తక్కువ బడ్జెట్ ఉన్నా మూడేళ్లలో సంక్షేమానికి 2లక్షల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి పన్నులు, ఛార్జీలు, భారాలు వేసి నాలుగేళ్లలో 2లక్షల కోట్లు ఇచ్చాడన్నారు. ప్రశ్నిస్తున్నాడని బాబాయ్​పై గొడ్డలివేటు వేసి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తల్లి, చెల్లిని తరిమేసిన నీకంటే పెత్తందారుడు ఎవరుంటారు జగన్ రెడ్డీ..? అంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు.

వాళ్లంతా జగన్ పెంపుడు కుక్కలు.. కాపులకు చంద్రబాబు ఏమీ చేయలేదు అని జగన్ దగ్గర ఉండే చెంచా కాపు నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని తెలుగు దేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. టీడీపీ హయాంలోనే కాపులకు న్యాయం జరిగింది... జగన్ ఏం చేశాడని నిలదీశారు. తాను సీఎం అయ్యాక 10 వేల కోట్లు కాపులకు ఇస్తానన్న జగన్.. ఒక రూపాయి ఇవ్వలేదని బోండా ఉమా... సీఎం జగన్ కాపు ద్రోహి అంటూ ధ్వజమెత్తారు. పదవుల కోసం వైఎస్సార్సీపీలో ఉన్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు కులాన్ని జగన్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టొద్దని హితవు పలికారు. చంద్రబాబు హయాం కాపులకు స్వర్ణయుగం అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ కాపు ప్రజా ప్రతినిధులు దెబ్బలు తినడం ఖాయమని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్న కాపు ప్రజా ప్రతినిధులు అంతా జగన్ పెంపుడు కుక్కలంటూ బోండా ఉమా మండిపడ్డారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details