ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన రాష్ట్ర స్థాయి కబ్బడ్డీ పోటీలు - state level kabaddi competitions ended

కృష్ణాజిల్లా అవనిగడ్డ కాలేజీ గ్రౌండ్స్​లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల్లో మహిళల విభాగంలో విజయనగరం జట్టు, పురుషుల విభాగంలో విశాఖ జట్లు విజేతలుగా నిలిచాయి.

state level kabaddi competitions ended at krishna district
ముగిసిన రాష్ట్ర స్థాయి కబ్బడ్డీ పోటీలు

By

Published : Feb 24, 2021, 9:11 AM IST

కృష్ణాజిల్లా, అవనిగడ్డ కాలేజీ గ్రౌండ్స్​లో.. మూడు రోజుల పాటు జరిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ 68వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం విజయవంతంగా ముగిశాయి.

ముగిసిన రాష్ట్ర స్థాయి కబ్బడ్డీ పోటీలు

విజేతలు :

  • మహిళలు విభాగంలో: విజయనగరం-విశాఖ జిల్లాల జట్లు తలపడగా విజయనగరం జట్టు విజేతగా నిలిచింది.
  • పురుషుల విభాగంలో: విశాఖ- కృష్ణాజిల్లా జట్ల మధ్య జరిగిన హోరాహోరి పోరులో.. విశాఖ జిల్లా జట్టు విజేతగా నిలిచింది.

పోటీలో విజేతలుగా నిలిచిన వారికి.. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పలువురు నేతలు కలిసి బహుమతులు ప్రదానం చేశారు.


ఇదీ చదవండి:విజయవాడలో పోలీసులకు వ్యాక్సినేషన్ ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details