ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమనీయం..శ్రీనివాసుని కల్యాణం.. - utsavalu

కృష్ణా జిల్లా తిరువూరులో శ్రీ వేంకటాచలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది.

శ్రీ వేంకటాచల స్వామి కల్యాణం

By

Published : Feb 20, 2019, 2:03 AM IST

కృష్ణా జిల్లా తిరువూరు తిరునాళ్ళుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటాచల స్వామివారి బ్రహోత్సవాల్లో మంగళవారం స్వామివారి కల్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది. ఏటా మాఘ పూర్ణిమనాడు స్వామి కల్యాణం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. పండితుల వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాద్యాల నడుమ క్రతువునుఎంతో వైభవంగా నిర్వహించారు. దంపతులు.. అమ్మవార్లను తమ కుమార్తెగా భావించి స్వామివారి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు.

వేంకటాచలస్వామి బ్రహ్మోత్సవాలు
శ్రీలక్ష్మీ,పద్మావతి సమేతుడైన శ్రీనివాసుని కల్యాణం కన్నుల పండువగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి క్రతువును తిలకించారు. అనంతరం స్వామి దర్శనానికి బారులు తీరారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు రథోత్సవం నిర్వహించారు. తర్వాత పల్లకిలో వధూవరులను కల్యాణ మంటపానికి తీసుకువచ్చారు. ముందుగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.

ఇవీచదవండి

ABOUT THE AUTHOR

...view details