రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌కు భద్రత పెంపు - sec news
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు భద్రత పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనంతరం అధికార పార్టీ నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రమేశ్‌కుమార్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది.
ఎస్ఈసీకి భద్రత పెంపు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి భద్రత పెరిగింది. సీఆర్పీఎఫ్ బలగాలు విజయవాడ బందర్ రోడ్డులోని రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నాయి. గన్నవరంలోని 39వ బెటాలియన్ నుంచి సీఆర్పీఎఫ్ సిబ్బంది వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, 8 మంది కానిస్టేబుళ్లు ఈ బృందంలో ఉన్నారు.