రాష్ట్ర అభివృద్ధిలో భాజపా మాట తప్పదు, మడమతిప్పదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(somu veerraju news) అన్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో తెదేపా, వైకాపాలు విఫలమయ్యాయని విమర్శించారు(somu veerraju slams ycp tdp news). దేశ సమగ్రాభివృద్ధిని ప్రాథమిక భాద్యతగా తమ పార్టీ (BJP News) భావిస్తోందని వివరించారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోషల్ మీడియా, పార్టీ మీడియా ప్రతినిధులు, ప్యానల్ లిస్ట్ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేంద్ర జలశక్తి మిషన్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌కు ఆర్టికల్ 370 లాంటిదని అభిప్రాయపడ్డారు. ప్రణాళికాబద్ధంగా నిరంతర ప్రక్రియగా భాజపా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు.
ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
రాష్ట్రంలో పూర్తికాని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని సోము వీర్రాజు అన్నారు. పోలవరం(polavaram project news) విషయంలో ఒక విధంగాను, హంద్రీనీవా, గాలేరునగరి, తోటపల్లి రిజర్వాయర్ విషయాల్లో మరో విధంగా రాజకీయ పక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 13వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని.. కానీ ఈ మూడేళ్లలో ఎంతపని జరిగిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెల్లాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అధికారానికి చేరువగా పార్టీని తీసుకెళ్లే దిశగా గట్టి ప్రయత్నం చేయాలని అన్నారు. నిర్మాణాత్మకమైన ఆలోచనలతో ప్రజలకు వాస్తవాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు.